Trend Micro Toolbar
ID
ohhcpmplhhiiaoiddkfboafbhiknefdfప్రమాదకరమైన వెబ్సైట్లకు దారితీసే లింక్‌లను ఒక్క చూపులో గుర్తించండి. Trend Micro భద్రతా సాఫ్ట్వేర్ అందించే రక్షణను మెరుగుపరచుకోండి.
స్క్రీన్షాట్లు
వివరణ
ప్రమాదకరమైన వెబ్సైట్లకు దారితీసే లింక్‌లను ఒక్క చూపులో గుర్తించండి. Trend Micro భద్రతా సాఫ్ట్వేర్ అందించే రక్షణను మెరుగుపరచుకోండి.
Trend Micro Toolbar సురక్షితంగా బ్రౌజ్ చేయడానికి, మోసాలు, ప్రకటనలు, పాప్-అప్‌లను నిరోధించడానికి, ఆన్లైన్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడానికి సహాయపడుతుంది. క్లౌడ్ ఆధారిత భద్రతా సాంకేతికతతో పనిచేసే ఇది, ఫిషింగ్, హానికరమైన వెబ్సైట్లు, గుర్తింపు దొంగతనం మరియు ఆన్లైన్ మోసాల నుంచి అధునాతన రక్షణను అందిస్తుంది.
మీరు షాపింగ్ చేస్తున్నా, బ్యాంకింగ్ సేవలను ఉపయోగిస్తున్నా, ఇమెయిల్‌ను చూసుకుంటున్నా లేదా సోషల్ మీడియాలో బ్రౌజ్ చేస్తున్నా, మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి Trend Micro అదనపు రియల్‌టైమ్ రక్షణను అందిస్తుంది.
ఫీచర్లు*:
వెబ్ ముప్పుల నుంచి రక్షణ: హానికరమైన వెబ్సైట్లు, ఫిషింగ్ లింక్‌లు, సాంకేతిక సహాయం అందిస్తామంటూ చేసే మోసాలు, బ్యాంకింగ్ మోసాలు మరియు ఇతర ఆన్లైన్ ముప్పులు మీకు హాని కలిగించకముందే వాటిని నిరోధిస్తుంది.
మోసాల తనిఖీ: బ్రౌజ్ చేస్తున్నప్పుడు అనుమానాస్పద కంటెంట్‌ను వెంటనే తనిఖీ చేసి, సంభావ్య మోసాలు లేదా మోసపూరిత సందేశాల గురించి హెచ్చరికలను పొందండి.
ప్రకటనల నిరోధకం: అంతరాయం కలిగించే ప్రకటనలు మరియు పాప్-అప్‌లను తొలగిస్తుంది. దీనివల్ల వెబ్సైట్లు వేగంగా లోడ్ అవుతాయి, మీ బ్రౌజింగ్ అనుభవం చిందరవందరగా లేకుండా, దృష్టి మరల్చే అంశాలు లేకుండా ఉంటుంది.
ఇమెయిల్ రక్షణ: ఫిషింగ్ ప్రయత్నాలు, మోసపూరిత సందేశాలు మరియు మోసపూరిత ఇమెయిల్‌లను గుర్తించడానికి మీ వెబ్‌మెయిల్‌ను (Gmail, Outlook.com, Yahoo Mail) స్కాన్ చేస్తుంది.
Pay Guard: మీ ఆన్లైన్ బ్యాంకింగ్ మరియు ఆర్థిక లావాదేవీలను మోసాలు, గుర్తింపు దొంగతనం నుంచి రక్షించడానికి Trend Micro డెస్క్‌టాప్ యాప్‌తో కలిసి పనిచేస్తుంది.
మీకు వీటి నుంచి రక్షణ లభిస్తుంది
ఆన్లైన్ మోసాలు
ఫిషింగ్ దాడులు
హానికరమైన వెబ్సైట్లు
బ్యాంకింగ్ మరియు షాపింగ్ మోసాలు
గుర్తింపు దొంగతనం
ఇమెయిల్ మోసాలు
గమనిక: కొన్ని ఫీచర్లకు Trend Micro ఖాతా మరియు సక్రియ సబ్స్క్రిప్షన్ అవసరం.
ఈరోజే Trend Toolbarను ఇన్స్టాల్ చేసి, మరింత సురక్షితమైన, వేగవంతమైన, మెరుగైన రక్షణతో కూడిన బ్రౌజింగ్‌ను ఆస్వాదించండి.
సందేహాలు ఉన్నాయా?
మా సహాయ వెబ్‌సైట్‌ను సందర్శించి మమ్మల్ని సంప్రదించండి:https://helpcenter.trendmicro.com/en-us/product-support/security-for-chrome/