Lucidchart for Education
ID
gdbabpaggdgcakhjllleobffeghmhjmeగుర్తింపు పొందిన విద్యాసంస్థల ఈమెయిల్ చిరునామా ఉన్న విద్యార్థులు, విద్యావేత్తలు మరియు అధ్యాపకుల కోసం రేఖాచిత్రాల సాఫ్ట్‌వేర్.
స్క్రీన్‌షాట్‌లు
వివరణ
గుర్తింపు పొందిన విద్యాసంస్థల ఈమెయిల్ చిరునామా ఉన్న విద్యార్థులు, విద్యావేత్తలు మరియు అధ్యాపకుల కోసం రేఖాచిత్రాల సాఫ్ట్‌వేర్.
Lucidchart అనేది రేఖాచిత్రాలను వేగంగా, సులభంగా గీయడానికి ఉపయోగపడే వెబ్ ఆధారిత సాధనం. విద్యార్థులు తమ అసైన్‌మెంట్‌లపై వ్యక్తిగతంగా పని చేయవచ్చు లేదా ఎంతమంది సహవిద్యార్థులతోనైనా కలిసి రేఖాచిత్రాలను అప్పటికప్పుడే సృష్టించవచ్చు, సవరించవచ్చు -- బృంద ప్రాజెక్టులకు ఎంతో అనుకూలం.
పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలకు అన్ని ప్రీమియం ఫీచర్లతో కూడిన ఉచిత విద్యా లైసెన్స్‌లను Lucidchart అందిస్తుంది. డెమోను ప్రారంభించడానికి 'Chromeకు జోడించు'ను క్లిక్ చేసి, ఉచిత లైసెన్స్‌ను పొందడానికి డెమోలో 'ఉచితంగా నమోదు చేసుకోండి'ను క్లిక్ చేయండి. మొత్తం పాఠశాల కోసం నమోదు చేసుకోవడానికి డొమైన్ నిర్వాహకులు కూడా ఇదే విధానాన్ని అనుసరించవచ్చు.
వందలాది టెంప్లేట్‌లు మరియు ఉదాహరణలు:
- ఫ్లోచార్ట్‌లు
- వెన్ రేఖాచిత్రాలు
- సమాచారాన్ని దృశ్యరూపంలో క్రమబద్ధీకరించే చిత్రాలు
- మైండ్ మ్యాప్‌లు
- సంస్థాగత నిర్మాణ చార్ట్‌లు
- ప్రాథమిక నిర్మాణ నమూనాలు / నమూనా రూపకల్పనలు
- UML / ERD
శక్తివంతమైనది, ఉపయోగించడం సులభం:
- వందలాది ఆకృతుల నుంచి ఎంచుకోండి
- మీ స్వంత చిత్రాలను లాగి వదలడం ద్వారా జోడించండి
- PDF, PNG మరియు JPG రూపాల్లో ఎగుమతి చేయండి
- బ్లాగులు లేదా వికీలలో రేఖాచిత్రాలను పొందుపరచండి
- స్పందించే ప్రాంతాలు మరియు స్థితులతో కూడిన పరస్పర చర్యల నమూనా రూపకల్పనలు
సహకారం:
- మార్పులు తక్షణమే సమకాలీకరించబడే ప్రత్యక్ష సహకారం
- ఒకేసారి కలిసి పని చేసే వ్యక్తుల సంఖ్యకు పరిమితి లేదు
- పూర్తి సవరణ చరిత్రతో శక్తివంతమైన సంస్కరణ నియంత్రణ
సమీక్షలు:
FreeTech4Teachers.com: “అనేక కోణాలు గల సమస్య లేదా భావనలోని భాగాలను విద్యార్థులు దృశ్యరూపంలో చూసి అర్థం చేసుకోవడానికి చార్ట్‌ను సృష్టించే ప్రక్రియ సహాయపడుతుంది. విద్యార్థులు చార్ట్‌లను సృష్టించడం, వాటిని పంచుకోవడం Lucidchart సులభతరం చేస్తుంది.”
TeachingHistory.org: “వెబ్ ఆధారిత, సరళమైన ఇంటర్‌ఫేస్ ప్రచురణ కోసం రేఖాచిత్రాలు మరియు ఫ్లోచార్ట్‌లను కలిసి సృష్టించడానికి వీలు కల్పిస్తుంది. వేగంగా పని చేయడం, నేర్చుకోవడం సులభంగా ఉండటం, కలిసి పని చేయడానికి వీలు కల్పించడం వల్ల ఈ సాధనాన్ని నేను సిఫార్సు చేస్తున్నాను.”